పల్లవి:Maname prabhuni paraloka gruhamu - tane nasinchunu daniyandu (2)
చరణం 1:ఎంత సుందరమో ప్రభునిగృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2)
ఏక శరీరము రక్తబంధముచే (2)
వేలాది భాషల నుండినను (1)
చరణం 2:ఒక నూతన వ్యక్తిగా మము జేసే - పరమ గృహమునకు చెందితిమి
ఐక్యతతో స్థిరముగ నమర్చబడిదేవుని గుడారముగా నైతిమి
చరణం 3:నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు
పామరులని జ్ఞానులనియు లేదు
యేసు ప్రభువే సర్వముగా
చరణం 4:ప్రభుని గృహమున కలహము లేదు - ఈర్ష్య కపట భేదము లేదు
శాంతి ఆనందము నిజ ప్రేమయుండును
నేర్పుతో నడుపును మన ప్రభువే
చరణం 5:ప్రభుని గృహము యిద్దరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె
ప్రతివానికి వాని పని నియమించె
కావలి యుండుము మెలకువతో
చరణం 6:దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులై యాత్రలో సాగెదము
ఆదర్శులమై ఈ జగమందున
పూర్తిగా శత్రువు నోడింతుము
చరణం 7:ప్రియుని దినము సమీపించుచున్నది - చెప్పెను మేల్కొని యుండుమని
విశ్వాస యోగ్యులముగ జీవించి
వేచియుండెదము