పల్లవి:కొనియాడి - పాడి కీర్తించి - వర్ణించెద నిను - నా ప్రభువా
చరణం 1:పరిశుద్ధుడవు - నీతిమంతుడవు (2) - పాపపు వస్త్రము - మార్చినదేవ
ప్రాపుగరక్షణ - వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను - ధవళ వర్ణుడా (2)
చరణం 2:తూర్పు జ్ఞానులు - నీ కర్పించిరి -బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను - నీ ఘన విజయము
భజియించెద - నిన్ను రత్న వర్ణుడా
చరణం 3:గుర్తించెద నిన్ను - ఘనముగ నేను - ఘనుడా నాకు - ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద
చరణం 4:ఆరాధించెద - ప్రభువా దేవా - ఆత్మతోను - సత్యముతోను
తిరిగిరానై యున్నా ప్రభువా
స్తుతియు ఘనత - మహిమయు నీకే