పల్లవి:ఆరాధించెద నిను మది పొగడెద - నిరతము నిను స్తుతియించెదను(2)మార్గము నీవే సత్యము నీవే (2) - జీవము నీవే నా ప్రభువా (2)
చరణం 1:విస్తారంబగు వ్యాపకములలో - విడిచితి నీ సహవాసమును (2)
సరిదిద్దితివి నా జీవితమును (2)
నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా (2)
చరణం 2:నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
నా కన్నీటితో నీ పాదములను
కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
చరణం 3:వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని
గుర్తించితిని నీ త్యాగమును
వినయముతో నీ సన్నిధి చేరి
చరణం 4:నీ రక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి
నీ రక్షణకై స్తోత్రము చేయుచు
నిత్యము నిన్ను కొనియాడెదను
చరణం 5:దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి
ప్రేమతో పరమ విందు నొసంగి
ఆనందింపగ జేసిన ప్రభువా
చరణం 6:ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు
నీ ప్రేమను నేనెన్నగ తరమా
నా జీవితమున చాలిన ప్రభువా
చరణం 7:పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను
లెక్కింపగ జాలని జనమందున
నను గుర్తింతువు నా ప్రియప్రభువా