CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 111

నిశ్చయముగ నిన్ను

nishchayamuga ninnu

ఆది. 12 : 2,3 "నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును... సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడుదురు."

More
పల్లవి:నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)",          "నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)
చరణం 1:ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తి గల యెహోవాను నేను (2) నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2)
చరణం 2:నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున
చరణం 3:యుగ యుగములు నీకు దేవుడను - కనాను దేశము నీ కొసగెదను నిత్య స్వాస్థ్యమును నీ కొసగెదను నీలో మహిమ నే పొందెదను
చరణం 4:గొప్ప జనముగా జేసెద నిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్ నీ నామమును గొప్ప జెసెదను - ఆశీర్వాదముగ జేసెదను
చరణం 5:నిన్నాశీర్వదించు వారిని - నేను ఆశీర్వదించెదను దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు