CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 112

ఆనందించెదము యెహోవాలో

aanandinchedamu yehovaalo

యెషయా 61 : 10 "ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు"

More
పల్లవి:ఆనందించెదము యెహోవాలో -  అతిశయించును మాదు ఆత్మరక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము - నీతి వస్త్రమున్ ధరింపజేసె
చరణం 1:పరదేశులు మమ్ము ప్రభువా దేవా - నీదు యాజక సేవకులనెదరు జగమున జనముల భాగ్యంబిచ్చి ప్రభవింతురంటివి ప్రభావముతో
చరణం 2:అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించుచు హర్షింతురంటివి
చరణం 3:వారు తమదు దేశము నందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు నిత్యానందము వారికి కలుగును ఎన్నడు వారిని విడువనంటివి
చరణం 4:న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము సత్యము బట్టి ప్రతిఫలమిచ్చుచు నిత్య నిబంధన చేసెదనంటివి
చరణం 5:జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూచినవారు
చరణం 6:భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనము వలె జనముల యెదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును
చరణం 7:క్రీస్తు నందు మాకిచ్చినయట్టి - ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై సర్వోన్నతుడా సన్నుతించుచు హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము