పల్లవి:నీ జీవితములో గమ్యంబుయేదో - ఒకసారి యోచించవా? (1)ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు - నీ హృదయమర్పింపవా (2)
చరణం 1:నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించినావా ఏ రీతి నిన్ను - నిర్మించె తన చేతులు (2)
చరణం 2:నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను
హృదయంపు తలుపు తెరువంగలేవా - యేసు ప్రవేశింపను
చరణం 3:తన చేతులందు రుధిరంపు ధారల్ - స్రవియించే నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా?
చరణం 4:ప్రభు యేసు నిన్ను సంధించినట్టి - సమయంబు ఈనాడేగా
ఈ చోట నుండి ప్రభు యేసు లేక - పోబోకుమో సోదరా!