CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 121

పరుగిడరా సోదరుడా

parugidaraa sodarudaa

యెషయా 55 : 6 “యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి...”

More
పల్లవి:పరుగిడరా సోదరుడా (1 )  - ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2)
చరణం 1:యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2) వేదన లెన్నో మీదికి వచ్చురా (2) కలవర మొందక కనిపెట్టుమురా(2)
చరణం 2:ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనప్పుడు దొంగవలె యిల దొరయై వచ్చురా
చరణం 3:ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరును గాని ఎరుగనె ఎరుగరు మెలకువతో యేసు పిలుపును వినుచు
చరణం 4:ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆకసమందలి శక్తులు కదలును మహిమతో యేసు యిమ్మహి దిగురా
చరణం 5:ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా క్రీస్తునందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర
చరణం 6:ఎటుచూచిన నీకటు కనిపించును - కొండల బండల నుండినను కొదమ సింహమై కోసాగ్నియై - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా
చరణం 7:ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి - రక్షకు డేసుని రాజ్యము చేర