పల్లవి:చూడుము ఈ క్షణమే కల్వరిని - ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను (1)గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు (1) - సిలువలో వ్రేలాడుచున్నాడుగా (2)
చరణం 1:మానవులెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక (2)
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు (2)
చరణం 2:ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
చరణం 3:మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని
చరణం 4:సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము