పల్లవి:యెరూషలేము గుమ్మములారా! రాజును లోనికి రానిమ్ము (1)చిరునవ్వులతో ప్రభుయేసుని నేదే ఆహ్వానించుము (2)
చరణం 1:విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి (2)
ఖర్జూరమట్టలు వస్త్రములెందుకు
మీ హృదయములను పరువుడి (2)
చరణం 2:అభ్యంతరపరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవ్వనులన్
ప్రభుని విజయము నందు వారిని
స్తుతిస్తోత్రములు పాడనిమ్ము
చరణం 3:నీ దుష్టక్రియలను బట్టి ప్రభుని దయను త్రోసెదవా
పరమ రాజును హృదయ మందిరమున
నేడే రానిమ్ము స్నేహితుడా
చరణం 4:నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా
గాయపడిన హస్తమును చాచి
నీ మదిలో చోటిమ్మనెను
చరణం 5:పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుము
జీవము రక్షణ శాంతి నొసగును
ఆయనే ప్రభువు శ్లాఘించుము