పల్లవి:సిలువ చెంతకురా - సిలువ చెంతకురాసహోదరా - సిలువ చెంతకురా, సహోదరీ - సిలువ చెంతకురా (1)ఎచ్చటలేని నెమ్మది ఉంది - ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది (2)
చరణం 1:యౌవ్వనకాల పాపములో - మరణ మార్గాన వెళ్లెదవా? (2)
యేసుని పొందని బ్రతుకులో - పాపములో మరణించెదవా? (2
చరణం 2:సమస్తము నష్టపరచుకొని - హృదయము బ్రద్దలై ఏడ్చెదవా?
యేసుని పొందని బ్రతుకులో- పాపములో మరణించెదవా?
చరణం 3:పాము జీవించు బిలములో - పక్షి జీవించ వీలగునా?
దుఃఖముతో నిండిన హృదయములో - నెమ్మది చూడవీలగునా
చరణం 4:సిలువలో వ్రేలాడు యేసుని - నీవు వీక్షించిన చాలును
రక్షకుడు చిందించిన రక్తములో - నీ పాపములన్ని కడుగబడున్