పల్లవి:నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను (2)సమాధాన సంతోషము (2) - అనుభవించితి నేను (2)
చరణం 1:ప్రభు వాక్యము నా పాపము చూపె (2) - హృదయము విరిచే ఆయన ఆత్మ (2)
గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని (2) - కోరితి రక్తము మదిలో (2)
చరణం 2:ప్రభు నా పాపము చూపించగానే- ఒప్పుకొంటిని కప్పుకొనక
విశ్వాసముతో కన్నీటితో - ఒప్పుకొనగ క్షమియించె
చరణం 3:పడమటికి తూర్పెంత దూరమో - నా పాపము నంత దూరపరచితివి
సముద్ర అగాధములలోన - నా పాపము పడవేసె
చరణం 4:మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగె - నాశన గోతిలో నుండి లేపి
నీ వీపు వెనుక నా పాపములు - పార వేసితి వీవు
చరణం 5:తుడిచితిననె ప్రభు నా పాపములు - జ్ఞాపకముంచుకొననని చెప్పె
మంచు విడచిపోయిన రీతి - నా పాపము తొలగించే