CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 146

యేసు ప్రభూ కావరి నాకు -వాసిగా స్తుతించెదన్

yesu prabhoo kaavari naaku -vaasigaa stutinchedan

More
పల్లవి:యేసు ప్రభూ కాపరి  నాకు - వాసిగా స్తుతించెదన్యేసు   గొఱ్రె పిల్లను - పోయెదను తన వెంట (2)
చరణం 1:పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్ స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి (2) ముందు ముందు వెళ్ళుచు - పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును (2)
చరణం 2:మరణలోయ ద్వారా - సరిగా నడిపించును అడవి భయములెల్ల - ఎడబాప్ రక్షించున్ హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
చరణం 3:శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్దిజేసి - ఆత్మదానమిచ్చెను వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను