పల్లవి:మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే (1)ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను (2)
చరణం 1:ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి (2)
యేసుడే నడుపును మనలను (2) - తన మార్గమునందున (2)
చరణం 2:ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
క్రీస్తునేగురిగా నుంచిన - విజయము నిశ్చయము
చరణం 3:ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును
చరణం 4:ఈ జగతిలో కష్టముల్ - బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును