CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 149

మా ప్రభుయేసు నీవే మా సర్వము

maa prabhuyesu neeve maa sarvamu

కీర్తనలు 36 :8 "నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు"

More
పల్లవి:మా ప్రభుయేసు నీవే మా సర్వము-మహిన్ మాకెపుడు నీతోనే  స్నేహము (2)
చరణం 1:సంతృప్తి నీ మందిరమున గలదు (2) - అందానంద ప్రవాహంబు మెరిసింది (2) వింతైన జీవపు యూటందు గలదు (2) యెంతైన మా పూజార్హుండ నీవె (2)
చరణం 2:ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు - మొదటి ప్రేమనెంతో విడచి పెట్టితిని సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా సతతంబు మా పూజార్హుండ వీవె
చరణం 3:మా తలపు మాటల్లో మా చూపు నడకలో మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము యెక్కడైనా మా యేసు సన్నిధిలో
చరణం 4:పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము - పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి పాలించుము ప్రభుయేసు రారాజ
చరణం 5:సోదర ప్రేమ సమాధానంబులతో - సాత్వీక సంతోష భక్తి వినయాలతో వింతైన మాదు స్తుతి పరిమళాలతో వినయంబున పూజింతుము నిన్ను