పల్లవి:అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి (1)నీదు ప్రేమ అపారము - ప్రభువా మా పై జూపితివి (2)
చరణం 1:మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు (2)
నీ కిష్టులముగా బ్రతికి (2)- దీవెనలెన్నో పొందెదము (1)
చరణం 2:నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్త జేసె
చరణం 3:లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో
చరణం 4:తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది దీవెనలెన్నో పొందెదము
చరణం 5:ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము
చరణం 6:ఆశీర్వాదముల కొరకు- పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము