CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 161

క్రీస్తేసు వారసులం- దేవుని వారసులం

kreestesu vaarasulam- devuni vaarasulam

More
పల్లవి:క్రీస్తేసు వారసులం- దేవుని వారసులం (2)
చరణం 1:దేవా! నీ రాజ్యమే రానిమ్ము మా ప్రభువా (2) ఎవరెవ్వరి పాపంబులు - క్షమియింపబడి యున్నవో (2) వారే దానిని చూతురు
చరణం 2:దేవా! నీ రాజ్యమే - పరలోక రాజ్యము ప్రభువా! ప్రభువా యనుచు - పిలుచు ప్రతివాడున్ అందెన్నడు చేరడు
చరణం 3:దేవా! నీ రాజ్యమే - నీతితో నిండియున్నది పరలోక తండ్రి చిత్తము - చేయు ప్రతివాడున్ వారే యందుండెదరు
చరణం 4:దేవా! నీ రాజ్యమే - శాశ్వతంబైనది ఈ లోక రాజ్యము లన్నియు - ఆయన క్రీస్తువగున్ దేవుని రాజ్యమగున్
చరణం 5:దేవా! నీ రాజ్యమే యుగంబులుండునది పొందువారికే గాని - మరెవ్వరికి చెందదు వారెంతో ధన్యులు
చరణం 6:దేవా! నీ రాజ్యమే నిశ్చలమై యున్నది దేవా! దహించు అగ్నిని నీ కృపను బొందెదము ప్రీతితో సేవింతుము
చరణం 7:దేవా! నీ రాజ్యమే మహిమతో నిండియున్నది (భూ)లోక రాజులెల్లరు నీ మహిమ చూచెదరు రాజుల రాజువు