CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 162

యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో

yesuni nammedivaaru aayana uchita krupato

కీర్తన. 92:12 "నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు"

More
పల్లవి:యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు (1)
చరణం 1:ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు (2) ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు (2)
చరణం 2:లెబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు ప్రభు కృపజ్ఞానములో - ఎదుగుచు నుందురు వారు
చరణం 3:యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు
చరణం 4:దేవుని యావరణములో - వర్థిల్లుచు నుండెదరు సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు
చరణం 5:వారు ముసలితనంబున - చిగురుపెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు
చరణం 6:నీటి కాలువ యోరను - నాటబడిన వారలై మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు
చరణం 7:హల్లెలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు