CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 163

సహింతుము శ్రమలన్నియు

sahintumu shramalanniyu

2 తిమోతి 2:12 "సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము"

More
పల్లవి:సహింతుము శ్రమలన్నియు - యేసుకై సంతోషముతో (2)
చరణం 1:యేసు కొరకై ఈ లోకములో - నిందలు హింసలు పొందగా (2) యేసు కూడ మన తోడుగా (2) సహించి ఓదార్చి ప్రేమ జూపును
చరణం 2:నీతి కొరకై ఆకలి దప్పి - కల్గి మన మెల్ల వేచియుండ నీతి సూర్యుడు మన తోడై నీతిని నెరవేర్చి కృప జూపును
చరణం 3:సువార్త కొరకై చెరనుండినా- కొరడాల దెబ్బల సహించగా దివారాత్రము గాయు ప్రభునేత్రము కృపజూపి ప్రేమతో ఆదరించును
చరణం 4:లోకమందు పలు శ్రమలు - లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోకమును జయించిన ప్రభువే మనల గాయును
చరణం 5:క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత - ముందు ఈ శ్రమలెన్నదగినవి కావు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము జూపు సహనమే