పల్లవి:ప్రేమించుచున్నావా ప్రభు యేసుని (2)
చరణం 1:మనము పాపులమై బలహీనులమై శత్రువులమై యుండ (2)
చచ్చిన పాపిపై కుమ్మరించెన్ - తన గొప్ప ప్రేమను (2)
ఎన్నతరమా ప్రభుప్రేమన్ (2) రుచించినావా నిస్వార్థ ప్రేమన్?(2)
చరణం 2:శిక్షకు పాత్రులమై యుండగ సత్యుండు యేసు బదులుగ వచ్చె",
"అతిహీనుడుగ కఠిన సిలువపై - ప్రేమను ఋజువు పరచె
అత్యున్నతమైన ప్రభు ప్రేమన్ - అనుభవించిన నీవు మరచెదవా
చరణం 3:శిష్యుడైన పేతురువలె వ్యసనపడి బహు దూరమై యుండగా
విడువని తన ప్రేమ ముమ్మారు - వెంబడించుట నేర్పించెన్
వర్ణింపగలవా ప్రభు ప్రేమన్- విశ్వసించి సాక్షిగా నుండెదవా
చరణం 4:ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు",
"ఆత్మలను తెచ్చుచు సంఘముగ- సమకూర్చుచు పోషించుము
ఆత్మ ఫలములను ఫలియించి - నిరతము ప్రభుని ప్రేమించుమా?