CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 172

యౌవనుడా క్రీస్తేసు యోధుడా

yauvanudaa kreestesu yodhudaa

More
పల్లవి:యౌవనుడా క్రీస్తేసు యోధుడాయౌవనమున కాడిని మోయు వాడ (2)ఓర్చు సామర్థ్యములు గలిగినేర్పుతో జీవించ నేర్వుము (1)
చరణం 1:రారాజు క్రీస్తుకు సైనికుడవై -సాతాను సేనల నెదిరించువాడవై (2) పోరాడు మత్యంతమగు సహనముతో (2) జయమొందగ ఆనంద భరితుడవై (2)
చరణం 2:శ్రమించి సేద్యము జేయువాడవై ప్రథమ ఫలముల భాగస్వామివై శ్రమఫలిత పంటల బహుగ కోయుచు సంతోషముతో జీవించు వాడవై
చరణం 3:బంధకములలో ప్రార్థించు వాడవై హింస దుఃఖము బాధ నోర్చెడి వాడవై అంధకారమన్న భయమేమిలేక హత సాక్ష్యమునకు సిద్ధపడు వాడవై
చరణం 4:క్రీస్తువలె ప్రేమించు వాడవై యేసు వలె సహించెడి వాడవై క్రీస్తును బోలి విజ్ఞాపన చేయుచు యేసువలె క్షమించెడి వాడవై
చరణం 5:ఎర్పర్చబడినవారు - నిత్య మహిమకై క్రీస్తేసు నందలి రక్షణ పొందుటకై ఓర్పు సహనము కలబరచువా-రు నిత్యము ఏలుదు-రు ప్రభు ప్రజలై