CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 175

విశ్వాస సహితముగను

vishvaasa sahitamuganu

2తిమోతి 2:3 "క్రీస్తుయేసు యొక్క మంచి రాణువవాడు"

More
పల్లవి:విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2)
చరణం 1:నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)
చరణం 2:నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కల్గి - పోరాడుడి విజయముతో
చరణం 3:ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను - పోరాదుడి విజయముతో
చరణం 4:క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో
చరణం 5:దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో
చరణం 6:ఆత్మల రక్షణ కొరకై - అర్పించుడి జీవితముల్ అంతము వరకు నిలచి - పోరాడుడి విజయముతో
చరణం 7:యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము