పల్లవి:రండి రండి యెహోవా యొద్దకు - ఆయన జ్ఞానమును పొందను (2)ప్రభు యేసును అనుసరించను (2)
చరణం 1:ఎడతెగక ప్రార్థించుము - మెలకువగా నుండి (2)
జయించెదవు శోధనలు - యేసు ప్రభుని శక్తితో (2)
చరణం 2:సాత్వికుడు దీనుండేసు - ఆయనను పోలినడువుడి
జీవించెదవు యేసు వలెనే - తండ్రి చిత్తము చేయుచు
చరణం 3:ప్రేమింపకుడి లోకమున్ - లోకములో ఉన్నవాటిని
తండ్రి ప్రేమ ఉండదు - అట్టివాని యందున
చరణం 4:యౌవనస్థులారా మీరు - బలవంతులు దేవునియందు
జయించితిరి లోకమును - మరియు సాతానును