పల్లవి:ప్రభు క్రీస్తు వారసులముగా - ఈ లోకమునందున మనముప్రతి విషయము నందత్యధిక - విజయమును పొందుచున్నాము (1)
చరణం 1:తండ్రి మన పక్షము నుండ - యెదిరించు విరోధి యెవడు? (2)
తనయుని యర్పించిన వాడు (2) - సకలము మన కెందు కొసగడు? (2)
చరణం 2:ప్రభు వేర్పరచుకొను వారిపై - నేరము మోపువాడెవడు?
ప్రభువైన దేవుడు గాక - నీతిగ తీర్చెడి వాడెవడు?
చరణం 3:రుణించు యేసు గాక - శిక్షించుట కర్హుడు యెవడు?
నిరతము విజ్ఞాపన జేయ- మృతిని గెలిచిన వాడెవడు?
చరణం 4:ప్రభు ప్రేమ నుండి మనల - యెడ బాప తలచు వాడెవడు?
ఖడ్గమున ద్వేషము చేత - యెడబాప గల వాడెవడు?