పల్లవి:ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు (1)ఎన్నదగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2)
చరణం 1:మరణము మ్రింగబడే - ఘన విజయము ప్రాప్తమాయె (2)
మరణము ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్ (2)
చరణం 2:ఎవరి మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
దైవశాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొందెదరు
చరణం 3:ఆశ్చర్యకరుడాయెనే - ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహుబుద్దిధ వివేకము లిచ్చి నపుడు సదా
చరణం 4:చంచల హృదయములను - ముష్కరులగు పాపులను
వంచన లేక వాక్యమునకు తలవంచి విదేయులౌదురు
చరణం 5:కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదేయను శబ్దము చెవులకు వినబడును
చరణం 6:పక్షిరాజు తనదు - పిల్లల కాచెడురీతి
రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా
చరణం 7:సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు