పల్లవి:రాజులకు రాజైన యేసు ప్రభువు రానై యున్నాడు (2)ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)
చరణం 1:తెలిసి కొంటివా నీవెంత ఘోరపాపివో
సిలువపై తీర్చెగా నీ పాపఋణమున్ (2)
ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు
లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా (2)
చరణం 2:బుద్ధిలేని కన్యలవలె మోసపోతివా
చేయలేవు ప్రభు సేవ నీశక్తితో
నూనెలేక భ్రమతో బ్రతికెదవా
లేనియెడల విడువబడెదవు సిద్ధపడుమా
చరణం 3:వాక్యముకై జీవితం అప్పగింపక
దాచితివా తలాంతులను లెక్కచేయక
మొదటి ప్రేమను తిరిగి పొందుమా
లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా
చరణం 4:ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో
కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో
ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా