పల్లవి:ఓ సంఘమా - క్రీస్తు దేహమా - ఓ సంఘమా - క్రీస్తు దేహమా (2)అంగములై యున్న - మీరందరు - క్రీస్తు శరీరమై - యున్నారు (2)
చరణం 1:శిరస్సైయున్న - క్రీస్తు దేహము నందు - ఏలాంటి అంగమై - నీవున్నావు (2)
క్రీస్తును శిరస్సుగా - కలిగియుండి - కలసి కార్యములు - చేయుదము (2)
చరణం 2:వివాదములు లేక - ఐక్యత కలిగి - యేకముగా ప్రభు సేవ - చేయుదము
కరములు కాళ్ళచే కలహించిన - కలుగునా క్రీస్తుకు - మహిమ ఘనత?
చరణం 3:లోక రక్షణ కొరకై - క్రీస్తు ప్రభువు - క్రయమును చెల్లించె - సిలువలో
నేడే ప్రభుక్రీస్తును - అంగీకరించి - అంగముగ చేరుము - క్రీస్తు శరీరములో