పల్లవి:నా యేసుని మార్గములో నేను నడిచెదను నడిచెదను (2)యే సమయమందున యే కాలమందునా (2)నా జీవితాంతము వరకు (2)
చరణం 1:నన్ను ప్రేమించిన నాకై ప్రాణమిచ్చిన (2)
నన్ను విమోచించి రక్షించిన (2)
చరణం 2:కరువు సంభవించిన - వ్యాధులు బాధించిన
నా యేసే నన్ను కాపాడును
చరణం 3:శోధనలు ఎన్నో - నన్ను కృంగదీసిన
ఆదరించి యేసే జయమిచ్చును
చరణం 4:కష్ట నష్ట శ్రమలలో - అందరు విడిచినను
నా యేసే నాకు తోడై యుండును
చరణం 5:లోకం శరీరం సాతాను - నన్ను పడవేసిన
నా యేసే లేపి నడిపించెను
చరణం 6:కాపాడుకొందును - నా పరుగు విశ్వాసమును
నా యేసే ఇచ్చును నీతి కిరీటం