CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 21

నా ప్రాణ ప్రియుడా యేసురాజా

naa praana priyudaa yesuraajaa

యెషయా 9:6 "... ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త... అని అతనికి పేరు పెట్టబడును"

More
పల్లవి:నా ప్రాణ ప్రియుడా యేసురాజా - అర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా(1)
చరణం 1:అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా (2) బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్ (2)
చరణం 2:విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా
చరణం 3:గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీ వెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా
చరణం 4:రక్షణాలంకారములను - అక్షయమగు నీ ఆహారమున్ర క్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును
చరణం 5:నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా
చరణం 6:వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ