పల్లవి:స్తుతులకు పాత్రుండవు (2)సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు (2)
చరణం 1:జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తి పరచిన ప్రియుడవు నీవే (2)
గొప్ప కార్యము చేయ (2) - మా సామర్ధ్యము నీవే (2)
చరణం 2:లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా
అద్భుతము చేసితివి - మా ప్రకాశమునీవే
చరణం 3:ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ జేసితివి - సంపూర్ణ శాంతి నీవే
చరణం 4:మంచి కాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల జేసితివి - గొట్టెల నడిపెదవు
చరణం 5:పునరుత్థాన జీవంబు నీవే - మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి
చరణం 6:మార్గసత్యము మాకిలనీవే - దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి
చరణం 7:నిజమైన ద్రాక్షపల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి