పల్లవి:జయమనిపాడు జయమనిపాడు ప్రభుయేసునకే (1)మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే (2)
చరణం 1:ఆది అంతము అల్ఫా ఓమేగ ఆయనే ప్రభువు (2)
ఆయన యేగా రానున్నవాడు - శక్తిమంతుడు (2)
చరణం 2:ప్రభు యేసునందు మమ్మును పిలిచి ఏర్పరచుకొనెను
ప్రేమతో మమ్ము పవిత్ర పరచి నిర్దోషులుగ తీర్చె
చరణం 3:యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి
యెంతో కృపతో మమ్మును కడిగి - మన్నించి నావుగా
చరణం 4:యేసులో మాకు యేశిక్షలేదు భయము బాసేగా
వాసిగ మరణ బలము తొలగించి పాపము బాపెగా
చరణం 5:క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను
కరుణించి మమ్ము అంగీకరించె ఎంతో అద్భుతము
చరణం 6:మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను
మనోనేత్రములు వెలిగించి మాకు - గొప్ప నిరీక్షణ నిచ్చె
చరణం 7:ప్రభు క్రీస్తులో వాడబారని స్వాస్థ్యముగ నైతిమి
పరిశుద్ధులలో మహిమైశ్వర్యంబు - యెంతో గొప్పది