పల్లవి:దేవాది దేవా - ప్రభువుల ప్రభూ (1) - రాజుల రాజా హల్లెలూయ (2)
చరణం 1:నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి (2)
పరలోకరాజ్య ప్రజలతో జేర్చి
పరలోకపాటన్ నాకొసగితివి (2)
చరణం 2:జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయమునిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి
జయజీవితము నాకొసగుచున్న
చరణం 3:పేరు పెట్టినన్ ప్రేమతో పిలిచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి
పరలోక దర్శనంబిచ్చితివి
చరణం 4:మరణ పాత్రులం ఈ ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము
నీ రాజ్యమందు రాజులన్ జేసి
చరణం 5:శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండ
నీ దయ నాపై నిండారనింపి
ఓదార్చి నన్ను నీ దారినడువు
చరణం 6:ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారముజల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్
ప్రతి పర్వతము ఆనందించున్
చరణం 7:పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ
జేర్చితివి నన్ నీ జనము జనము నందు