పల్లవి:నా పాపములను క్షమియించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ (1)ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నాకొరకొసగెన్ (1)
చరణం 1:మలిన వస్త్రములతో నేను - చెడిన హృదయముతో నేను (2)
కలువరి సిలువను చేరన్ (2)
చరణం 2:మరణము నుండి నా ప్రాణమును - కన్నీటి నుండి నా కన్నులను
తప్పించెను నా తండ్రి
చరణం 3:నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను
నా ప్రభు నా మొర వినును
చరణం 4:యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయము గల దేవుండు
సాధువులను గాపాడున్
చరణం 5:మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను
నా ప్రభునే స్తుతియింతున్
చరణం 6:యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను
జూపించన్ - బహుప్రియమున నను బిలచెన్