CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 31

పొందితిని నేను ప్రభువా నీ నుండి

ponditini nenu prabhuvaa nee nundi

2 కొరింథీయులకు 9 : 15 “చెప్పకస్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.”

More
పల్లవి:పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్ఠయీవిని ఈ భువియందు (2)
చరణం 1:జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)-ఇంతవరకు నాకు తోడై యుండి (2) ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా (2) నా రక్షణ కర్తవు నీవైతివి (2)
చరణం 2:గాలి తుఫానులలో నుండి వచ్చితిని - అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి
చరణం 3:కష్టదుఃఖంబులు నాకు కలుగగా - నను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందున ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి
చరణం 4:నాదేహమందున ముల్లు నుంచితివి - సాతానుని దూతగా నలుగగొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి
చరణం 5:నీ ప్రేమ చేత ధన్యుడనైతిని - కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షల యందున ప్రభువా జయజీవితము నాకు నేర్పించితివి