CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 35

ఆనందముతో - స్తుతియించెదము

aanandamuto - stutiyinchedamu

లూకా 17:16 "ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల యొద్దసాగిలపడెను"

More
పల్లవి:ఆనందముతో - స్తుతియించెదము ప్రభుయేసు పాదముల - పూజింతుము
చరణం 1:మరణాంధకార లోయలోన - సాతాను చెరలో నేనుండగ తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి - నీ ఘనత కొరకై యేర్పరచితివి
చరణం 2:నరకాగ్ని పాలాయె నా ప్రాణము - తప్పించుకొను మార్గము లేకుండగా నీ రక్తము కార్చి ప్రాణ త్యాగముతో - భరియించలేని బాధను యోర్చితివి
చరణం 3:విలువైన ప్రేమ కనబరచితివి - నా ఘోర పాపములు క్షమియించితివి ప్రభు క్రీస్తు సన్నిధినిత్యము నుండు - ఆశను నాకెంతో కలిగించితివి
చరణం 4:గర్భమున నేను రూపింపక మునుపే - నా దేవ నీవు నన్నెన్నుకొని ఈ లోక సంబంధ బంధము తెంచి - పరలోక ద్వారము తెరచితివి
చరణం 5:అరణ్యమందు నడచిన గాని - యెండిన నేలను నిలచిన గాని పరలోక తండ్రి మారని ప్రేమను వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తుదును