పల్లవి:యౌవ్వనులైన శిష్యులవలె మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా (2)
చరణం 1:ఓ పరలోకపు తండ్రీ ! యూదా గోత్రపు సింహమా ! (2)
పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి (2)
పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు (2)
ప్రార్థించను నేర్పించుమా (2)
చరణం 2:ఓ పరలోకపు తండ్రీ ! దీవెనలొసగె దేవా !
మా ప్రతి అవసరములలో నమ్ముటకు కృపనిమ్ము
విశ్వాసముతో, ఉజ్జీవాత్మతో కొనసాగుటకు కృపనిమ్ము
ప్రార్ధించను నేర్పించుమా
చరణం 3:ఓ పరలోకపు తండ్రీ ! విజయుండవగు దేవా !
మా చెడు తలంపులలో మాటలలో క్రియలలో
శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నిమ్ము
ప్రార్ధించను నేర్పించుమా
చరణం 4:ఓ పరలోకపు తండ్రీ ! ఏడు కన్నులు గల దేవా!
సాతాను క్రియలలో శోధనలో మమ్ములను
విడిపించుము నడిపించుము కను పాపగ కాపాడుము
ప్రార్ధించను నేర్పించుమా