CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 39

నీ స్వరము వినిపించు ప్రభువా

nee svaramu vinipinchu prabhuvaa

కీర్తనలు 119:17 "నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును"

More
పల్లవి:నీ స్వరము వినిపించు ప్రభువానీ దాసుడాలకించున్ (2)నీ వాక్యమును నేర్పించుదానియందు నడచునట్లు నీతో (2)
చరణం 1:ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము (2) దినమంతటి కొరకు నను సిద్ధపరచు (1) రక్షించు ఆపదల నుండి (2)
చరణం 2:నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిజేసికొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు
చరణం 3:భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను
చరణం 4:నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిజేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా
చరణం 5:నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించున్
చరణం 6:నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలుచునట్లుగా
చరణం 7:నా హృదయములోని చెడు తలంపులను ఛేదించునీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా