చరణం 1:నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దము
సేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపనీ
నాతో నీవేమందువో - నేనాలించువాడనే
చరణం 2:నాథా! నీ శబ్దమాలింప నన్ను సిద్ధపర్చుము
నీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీ
నాతో నీవే మందువో - నేనాలించువాడనే
చరణం 3:నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకు
నిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగి యుందువు
ఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును
చరణం 4:నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుము
నిన్ను వెంబడించునట్లు - నిబ్బరింపజేయుము
నేను నీదు గొఱ్ఱె ను - బండనీడల్ మేపుము