CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 42

ప్రీతిగల మన యేసు

preetigala mana yesu

యోహాను 15:15 "ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను”

More
చరణం 1:ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును క్రీస్తు నొద్ద మన భార - మంత నప్పగించినన్ శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును
చరణం 2:నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు మృతి బొంది కృపతో వి-శ్రాంతి కలిగించెను భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత - క్రొత్తగతి జూతురు
చరణం 3:దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్ జయ మొప్పనోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును
చరణం 4:ధరణిలో యేసుగాక - వేరె గొప్ప మిత్రుడా! పరలోకమందు నింక - పరమ రక్షకుడా! నరులను గావ వేగ - గ్రూరహింస బొందుచు కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించును