CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 41

ఓ ప్రార్థనా సు ప్రార్థనా

o praarthanaa su praarthanaa

1 థెస్స. 5: 16 "యెడతెగక ప్రార్థన చేయుడి”

More
చరణం 1:ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా? నా ప్రభువున్ ముఖాముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా -నీ
చరణం 2:పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే - నా శైలమైన ప్రార్థనా నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా నా శోకమెల్ల దీర్చెడు - విశేషమైన ప్రార్థనా -నా శోక
చరణం 3:నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను నా దేవుడేసు చెంతకు - మోదంబు గొంచుబోవును సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్థనా -నా ధైర్య
చరణం 4:అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం బురంగుగాను నెక్కి నా- చిర గృహంబు జూతును శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ - బరేశు ధ్యాన ప్రార్థనా -కరంబు