CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 51

ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు

prabhu kummarinchu prabhu kummarinchu

యెషయా 44:3 “నేను దప్పి గలవాని మీద నీళ్లను యెండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను.”

More
పల్లవి:ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)దీవెనల వర్షము కుమ్మరించుము (1)
చరణం 1:ఓ మా యేసు విను మా మనవి (2)-మా మధ్యకు ప్రభు రారమ్ము (2) నీ ద్వారమున చేరి యున్నాము (2) నింపుము ప్రభువా మమ్ములను (2)
చరణం 2:దప్పిగొన్న వారికి జలము-యెండిన భూమికి జలధారల్ నీ సంతతిపై ఆత్మను పంపు-నీ దీవెనలతో నింపుము
చరణం 3:తండ్రి కుడి ప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము
చరణం 4:రెండు కెరూబుల మధ్య నుండి- మధుర స్వరము విననిమ్ము యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము
చరణం 5:తెరువబడిన పరమును చూడ-దూతలు యెక్కుచు దిగుచుండ నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు