పల్లవి:నీతిమంతుల ప్రార్ధన దేవుడాలకించును (1) వారు తమాల వృక్షము వలె మొవ్వు వేయుదురు (2)
చరణం 1:మొరపెట్టుము గ్రాహ్యము కాని గొప్ప సంగతులు
మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్
చరణం 2:గతకాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి
సతతము ఆనంద మొంద అడుగుడి దొరుకున్
చరణం 3:యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము
ఇహము నందు పక్షిరాజు వలె పై కెగురుదురు
చరణం 4:ఊహించలేనిది శక్యము గాని వైనట్టి క్రియలను
యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా
చరణం 5:మిమ్ము విడువనెన్నడు నెడబాయననెగదా
నమ్ముము నరమాత్రుండెవుడే హాని చేయడు
చరణం 6:ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో
మీ ప్రతి యవసరము తీర్చి కాచు నిరతమున్
చరణం 7:నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును
నిశ్చయముగా వృద్ధి పొందితుననె నీ దేవుడు