పల్లవి:సిలువను వీడను - సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను -సిలువను వీడను సిలువను వీడను
చరణం 1:నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? (1)
గొల్గొతా కొండ బాధలో - పాలు పొందెదవా? (2)
చరణం 2:బంధుమిత్రుల మధ్యను - శ్రమ సహింతువా?
మూర్ఖకోపిష్టుల మధ్య - దిట్టముగ నుందువా?
చరణం 3:ఆకలి దాహ బాధలో - ధైర్యంబుగ నిల్తువా?
అవమానము వచ్చినను - సిలువను మోతువా
చరణం 4:పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?
భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?
చరణం 5:లోకులు నాశ మైరిగా - వీరులు లేకయే
విమోచకుడు సిలువలో - వ్రేలాడి మృతి పొందెను
చరణం 6:జీవాంతరము వరకు - నిల్చి పోరుసల్పి
దైవ కృపచే గెల్చినే - మోక్షము చేరుదున్