పల్లవి:నీ యౌవ్వనమును ఓ యౌవ్వనుడాచేయకు వ్యర్థము చేయకుము (2)
చరణం 1:దైవభక్తి యుండుటే జ్ఞానమునకు మూలము (2)
దేవుని గూర్చిన తెలివి వివేచన కాధారము (2)
జ్ఞానియైన యెడల నీకే లాభమగును (2)
చరణం 2:తృణీకరింపనియ్యకు నీ యౌవ్వనమును
మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలో
మాదిరిగ నుండుము విశ్వాసులకు
చరణం 3:సిలువయే నీ శక్తి గురిగా నుంచుము
ప్రభు వాక్యము నీలో నివసింపనీయుము
సాతానును జయించి బలము నొందుము
చరణం 4:నీ యౌవ్వనములో జ్ఞాపకముంచుకో
ప్రభువు చూచి వినుచున్నాడని
నీ సృష్టికర్తను స్మరియించుము
చరణం 5:ప్రభుని సేవకై అర్పించుకొనుము
ఆత్మల రక్షణకై చాటించు సువార్తను
నీ సేవ ద్వారా ప్రభు తృప్తి నొందును