CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 64

సీయోను పాటలు సంతోషముగ

seeyonu paatalu santoshamuga

హెబ్రీ. 13 : 14 "నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు"

More
పల్లవి:సీయోను పాటలు సంతోషముగపాడుచు సీయోను వెళ్ళుదుము (2)
చరణం 1:లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకము నందు - కొంతకాలమెన్నో శ్రమలు (2)
చరణం 2:ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్యవాసులె యీ ధరలో నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు - కానానుపై నిలుపుడి
చరణం 3:మారానుపోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాటనమ్ము
చరణం 4:ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని - విధేయులై విరాజిల్లుడి
చరణం 5:ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చు నేసు సీయోను గీతము సొంపుగ కలిసి - పాడెదము ప్రభుయేసుకు జై