CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 65

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా

amoolya raktamu dvaaraa rakshana pondina janulaaraa

ఎఫెసీ. 2:13 "అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు”

More
పల్లవి:అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారాసర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదముఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము (1)
చరణం 1:మన యౌవ్వన జీవితముల్ - శరీరాశకు లోబరచి (2) చెడుమాటలను పలుకుచు - శాంతి లేక యుంటిమిగా (2)
చరణం 2:చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
చరణం 3:నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి
చరణం 4:కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను
చరణం 5:తన రక్తధారలలో - మన పాపములను కడిగి మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో
చరణం 6:పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘనప్రేమ కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
చరణం 7:మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్