పల్లవి:క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున (1)ఎవరు చేరెదరో వారె ధన్యులు పరలోకమే వారిది (2)
చరణం 1:అపొస్తలుల బోధను నవ్మి స్థిరపరచబడిన వారె (2)
అత్మ శక్తితో వారు యెల్లప్పుడు సంఘములో నిలిచెదరు (2)
చరణం 2:పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో
వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువునందు
చరణం 3:ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారె తనయందు నిలచెదరు
ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు
చరణం 4:పట్టువదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారె
చరణం 5:క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకమునందు