CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 70

యేసు క్రీస్తు ప్రభువాయనే

yesu kreestu prabhuvaayane

1 తిమొతి 1:15 "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను"

More
పల్లవి:యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు (1) పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి (2)
చరణం 1:నరులన్ గావన్ శ్రమలన్ బొందెన్ క్రీస్తు ప్రభువు (2) తిరిగెన్ భువిన్ సుఖమున్ విడిచి శిష్యులు వెంట నుండన్ (2)
చరణం 2:నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను
చరణం 3:భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే భీతిన్ విడిచి యేసు వైపు చూడు నిమ్మళించును
చరణం 4:మరణమేలు లోయలందు సంచరించెడు తరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్
చరణం 5:మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచి తనయులమై యుద్ధమందు జయము నొందెదము