చరణం 1:నాకై చీల్చబడ్డయో - నా యనంత నగమా
నీలో దాగియుందును - జెన్ను మీర బారెడు
రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము
చరణం 2:నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను
కాలమెల్ల నేడ్చినన్ - వేలకృతుల్ చేసినన్
నేను చేయు పాపము - నేనే బాపజాలను
చరణం 3:వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్
దిక్కులేని పాపిని - బ్రక్కజేర్చి బ్రోవుము
నా కళంక మెల్లను - నాథా నీవె బాపుము
చరణం 4:ఈ ధరిత్రియందున - నేఱుదాటునప్పుడు
నాదరించి నీకడన్ - నాకై చీల్చబడ్డయో
నా యనంత శైలమా - నన్ను చేరదీయుమా