CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 72

మనకు జీవము యేసు ప్రభువు

manaku jeevamu yesu prabhuvu

కొలాన్స 3:4 “మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు"

More
పల్లవి:మనకు జీవము యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమౌదుము ఆయన మహిమలో (2)
చరణం 1:ఆదియంతము ప్రభుయేసే - అదృశ్య దేవుని స్వరూపుడు (2) అన్నింటిని నిర్వహించెదు - అద్భుత యేసుకే స్తోత్రములు (1)
చరణం 2:ప్రభుయేసు మరణించెను- విభుడు సర్వలోకముకై ప్రభవిల్లను జీవమిచ్చెను- అభయునకే స్తుతి పాడెదము
చరణం 3:లోకముకై జీవించక - లోకేశునకై జీవించుచు సాతానుపై జయమొందుచు - వీకతో నేగెదము స్తుతితో
చరణం 4:దైవత్వము గలయేసు - అవనిలో నుండుటే గొప్ప మర్మము సంపూర్ణత గలవారమై - సత్యుండేసుని స్తుతించెదము
చరణం 5:పరలోక పౌరులుగా - పరిశుద్ధ ప్రజలముగా సర్వములో క్రీస్తేనని - సర్వేశుని సన్నుతించెదము