పల్లవి:ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము (1) హల్లెలూయ - ఎంతో సంతోషం (1) ఎగిరి పోయెదం - పాటలతో (2)
చరణం 1:బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - గాంచెదమేసున్ మా ఎదుట (1)
ఓర్పుతో మేము వేచియుంటిమి (1)-నిద్రించే వారు నిలతురిలన్ (2)
చరణం 2:భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమై కూడి - పాటతో బూర ధ్వనింతురు ||ప్రాణ||
చరణం 3:వేకువ చుక్క కాంతిని బోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నా కొరకై శ్రమసహించెను ||ప్రాణ||
చరణం 4:రెప్పపాటుతో శుద్ధులు లేచి - మరుగైపోదు రాయనతోనుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మేసు నచ్చట ||ప్రాణ||
చరణం 5:పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్బుదినం
సంఘ వధువు ధవళ వస్త్రంబు ధరించి ఘనతనొందె దినం ||ప్రాణ||
చరణం 6:హల్లెలూయ ఆనందించెదం - హల్లెలూయ ఆర్భటింతుం
హల్లెలూయా ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్ ||ప్రాణ||